2, ఆగస్టు 2012, గురువారం

మా గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు.. శ్రీ కాంచీపుర క్షేత్రంలో మూడురోజులు ప్రవచనాలు చేసారు. మా దంపతులం ఆ కార్యక్రమమునకు హాజరు కాగలగడం మా అదృష్టం.. కంచి పీఠాధిపతుల దర్శన భాగ్యం కలిగింది.. శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారికి,
శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వాములవారికి భక్తితో "విజయగీతిక" పుస్తకాలను సమర్పించుకున్నాము...
"నీవే వ్రాసావా.. అహాఁ" అని పెద్ద స్వామి అంటే, "భక్తి విజయగీతిక..ఊఁ" అని చిన్న స్వామి తలపంకించారు.. మహద్భాగ్యమని పొంగిపోయాము మా దంపతులము.. ఆ ఆనందము మీతో పంచుకుందామనిపించింది...

1 కామెంట్‌:

  1. చాలా సంతోషం. మీరు ఇరువురూ చాల అదృష్టవంతులు. అందరికీ ఆనందాన్ని పంచుతూ అందరి వారిగా నిలిచి, ఆధ్యాత్మికతను అన్ని వేళలా ఆచరిస్తూన్న

    మీకు - భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన అవకాశం.

    మీ కృషి, దీక్ష, అందరికీ ఆనందాన్ని పంచే మీ జీవన శైలి మా అందరికీ ఆచరయోగ్యము.

    నమస్సుమాంజలిలతో,

    శివ కుమార్ దినవహి

    రిప్లయితొలగించండి