13, ఆగస్టు 2012, సోమవారం

శ్రీ కృష్ణ జన్మాష్టమి...






















హే కృష్ణా... ముకుందా... మురారీ...





ఆరగించవయ్యా.. కిట్టయ్యా..


                                                  
      బుద్ధిగా బజ్జోవయ్యా నటనసూత్రధారీ 







నీవిచ్చినది నీకే సమర్పయామి

ఎంత చూసినా మరల మరల చూడాలనిపించే సౌందర్య సార సర్వస్వం......


బృందావన విహారీ... జయ జయ మురారి
శ్రీ కృష్ణ జన్మాష్టమి... ఇష్టమైన పండుగ, నాకైనా మీకైనా..నిజమే కదా?  నాకు చేతనైన రీతిలో నేను కూడా అది  సెలెబ్రేట్ చేయడం నాకు ఓ ముచ్చట.. ఇదివరలో పిల్లలు నాకు సహకరించేవారు.. ఇప్పుడు వాళ్లు కాపరాలకు వెళ్లిపోయారు.. చిన్ని కన్నయ్యకు మంచి బట్టలు కట్టి.. అలంకరించి... పూజ చేసి.. శక్తి మేరకు నైవేద్యాలు అర్పించాను... ముత్తైదువలు వచ్చి పాటలు పాడారు.. ఊయలలో చిన్ని కిష్టయ్యను ఊపి ,,,లాలి పాడి బజ్జో పెట్టారు...ఆ ముచ్చట మీతో పంచుకుందామని...

8, ఆగస్టు 2012, బుధవారం

గోవర్థన గిరిధారి....

గోవర్థగిరి నెత్తిన గోవిందుడోయమ్మా
గోకులమునకు వ్యాకులమును తీర్చిన ఘనుడమ్మా  || గోవర్థన  ||

ఒకటా రెండా ఏడు దినములు పట్టి
గోవుల గోపాలకులను కాచినాడమ్మా || ఒకటా ||   ...    || గోవర్థన  ||

ఏడుకొండలపై కొలువున్న గోవిందుడే
మన సకలేంద్రియములను నడిపే గోవిందుడు
రేపల్లె జనుల నేమాయ కమ్మెనో...
పరమాత్మ తత్త్వమే తాను దాచెనో....  || రేపల్లె ||
గోవిందా.....గోవిందా.....గోవిందా.....గోవింద.....                  || గోవర్థన  ||

యజ్ఞభోక్త, యజ్ఞకర్త, యజ్ఞఫలప్రదాతైనా
ధర్మమెరుగజేయ నడయాడెనో....
నందగోకులవాసుల జన్మలు పండెనో            ||ధర్మమెరుగజేయ||

గోవిందా.....గోవిందా.....గోవిందా.....గోవింద.....                  || గోవర్థన  ||
(lyric by dinavahi vijayalakshmi... you can hear the song by vijayalakshmi...www.yourlisten.com...bhaktivijayageethika or my face book.)

2, ఆగస్టు 2012, గురువారం

మా గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు.. శ్రీ కాంచీపుర క్షేత్రంలో మూడురోజులు ప్రవచనాలు చేసారు. మా దంపతులం ఆ కార్యక్రమమునకు హాజరు కాగలగడం మా అదృష్టం.. కంచి పీఠాధిపతుల దర్శన భాగ్యం కలిగింది.. శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారికి,
శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వాములవారికి భక్తితో "విజయగీతిక" పుస్తకాలను సమర్పించుకున్నాము...
"నీవే వ్రాసావా.. అహాఁ" అని పెద్ద స్వామి అంటే, "భక్తి విజయగీతిక..ఊఁ" అని చిన్న స్వామి తలపంకించారు.. మహద్భాగ్యమని పొంగిపోయాము మా దంపతులము.. ఆ ఆనందము మీతో పంచుకుందామనిపించింది...