Firs copy was given to Dr.T.V.Narayana rao, Reputed Eurolgist in Rajahmundry and who is authority in Puranas and Kavyas.
జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. అటువంటిదే ఈ పుస్తక ఆవిష్కరణ. విన్న ఏవో పాటలు నా ఆనందంకోసం పాడుకుంటు ఉండడమే కాని, ఇలా గీతరచన, పుస్తక ప్రచురణ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఇది కేవలం జగజ్జనని కృపా విశేషం. మా గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి అనుగ్రహ విశేషం. వారి అమృతోపమానమైన ఆధ్యాత్మిక ఉపన్యాసములు వింటూ ఉంటాను.. భగవద్భక్తి వాటివలన దృడపడుతోంది.. ఆ ఆలోచనలే నాలో మెదిలి గీతాలుగా ... సుస్వర గీతాలుగా రూపుదిద్దుకున్నాయి. రెండు వందల పైగా ఎలావ్రాసానో ఆ జగన్మాతకే తెలియాలి. అవి విన్న సౌజన్యమూర్తి శ్రీమతి లలితా అన్నప్పారావు, విశాఖపట్నం చాలా ప్రోత్సహించి పుస్తకంగా అందీయమన్నారు. గురువుగారు కూడా ఆ ఆలోచనకు అంగీకరించారు. ఫలితంగా నూటఎనిమిది గీతాలతో "భక్తి విజయ గీతిక" వెలుగు చూసింది. ఈ పుస్తకం పేరు సంస్కరించడమే కాకుండా శ్రీ షణ్ముఖ శర్మగారు దీనికి ముందుమాటగా శివాకాంక్షలు అనుగ్రహించారు.. వారి చేతులమీదుగా దీని ఆవిష్కరణ జరిగింది. అంతకన్నా అదృష్టమేముంది ?
అతి తక్కువ సమయంలో ముద్రణ పూర్తిఅయి, పుస్తకంగా అందీయడంలో సహకరించిన డా.అరిపిరాల నారాయణరావుగారికి కృతజ్ఞతలు చెప్పకతప్పదు. ఎందరో సహకరించారు... అందరికి కైమోడ్పులు. ఈ బ్లాగులో అందరి ప్రోత్సాహంతో వీలువెంబడి పాటలు పరిచయం చేయాలని ఆలోచన...